showri

Best Blogger TipsGet Flower Effect

Saturday, 16 February 2013

స్వరాల అర్ధ వివరణ


స్వరాల అర్ధ వివరణ

ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ, మరియు ని) సాంప్రదాయం ప్రకారం వివిధ జంతువుల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో చక్రాలు కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.
స్వరంవివరణఅర్ధంజంతువుచక్రందేవుడు
షడ్జం (षड्जं)Sagarనెమలిmūlādhāra मूलाधार (anus)బ్రహ్మ
రిరిషభం (रिषभं)bullఎద్దుsvādhiṣṭhāna स्वाधिष्ठान (genitals)అగ్ని
గాంధారం (गान्धारं)Gaganమేకmaṇipūra मणिपूर (solar plexus andstomach)రుద్రుడు
మధ్యమం (मध्यमं)middleక్రౌంచపక్షిanāhata अनाहत (heart and lungs)విష్ణువు
పంచమం (पंचमं)fifthకోయిలviśuddha विशुद्ध (throat)నారదుడు
ధైవతం (धैवतं)Dhartiగుర్రంājñā आज्ञा (third eye)వినాయకుడు
నినిషాదం (निषादं)outcast/hunterఏనుగుsahasrāra सहस्रार (crown of the head)సూర్యుడు

సప్తస్వరాలు


భారతీయ సంగీతంలో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ధ, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.
'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవదం, 'ని ' నిషధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.
సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు. ,శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.

స = షడ్జమం (నెమలి క్రేంకారం)
రి = రిషభం (ఎద్దు రంకె)
గ = గాంధర్వం (మేక అరుపు)
మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
ప = పంచమం (కోయిల కూత)
ధ = ధైవతం (గుర్రం సకిలింత)
ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

  • ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
    • ఉదా: స రి గ మ ప ధ ని స.
  • అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
    • ఉదా: స ని ధ ప మ గ రి స.

[మార్చు]కర్ణాటక సంగీత స్వరాలు

కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 12 స్వరాలు ఉన్నాయి.

స్థానముస్వరముShort nameNotationMnemonic
1షడ్జముSsa
2శుద్ధ ఋషభమురిR1ra
3చతుశ్రుతి ఋషభమురిR2ri
3శుద్ధ గాంధారముG1ga
4షట్చ్రుతి ఋషభమురిR3ru
4సాధారణ గాంధారముG2gi
5అంతర గాంధారముG3gu
6శుద్ధ మధ్యమముM1ma
7ప్రతి మధ్యమముM2mi
8పంచమముPpa
9శుద్ధ ధైవతముD1dha
10చతుశ్రుతి ధైవతముD2dhi
10శుద్ధ నిషాదమునిN1na
11షట్చ్రుతి ధైవతముD3dhu
11కైసికి నిషాదమునిN2ni
12కాకలి నిషాదమునిN3nu