భారతీయ సంగీతంలో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ధ, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.
'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవదం, 'ని ' నిషధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.
సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు. ,శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.
స = షడ్జమం (నెమలి క్రేంకారం)
రి = రిషభం (ఎద్దు రంకె)
గ = గాంధర్వం (మేక అరుపు)
మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
ప = పంచమం (కోయిల కూత)
ధ = ధైవతం (గుర్రం సకిలింత)
ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)
- ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
- ఉదా: స రి గ మ ప ధ ని స.
- అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
- ఉదా: స ని ధ ప మ గ రి స.
[మార్చు]కర్ణాటక సంగీత స్వరాలు
కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 12 స్వరాలు ఉన్నాయి.
| స్థానము | స్వరము | Short name | Notation | Mnemonic |
|---|---|---|---|---|
| 1 | షడ్జము | స | S | sa |
| 2 | శుద్ధ ఋషభము | రి | R1 | ra |
| 3 | చతుశ్రుతి ఋషభము | రి | R2 | ri |
| 3 | శుద్ధ గాంధారము | గ | G1 | ga |
| 4 | షట్చ్రుతి ఋషభము | రి | R3 | ru |
| 4 | సాధారణ గాంధారము | గ | G2 | gi |
| 5 | అంతర గాంధారము | గ | G3 | gu |
| 6 | శుద్ధ మధ్యమము | మ | M1 | ma |
| 7 | ప్రతి మధ్యమము | మ | M2 | mi |
| 8 | పంచమము | ప | P | pa |
| 9 | శుద్ధ ధైవతము | ధ | D1 | dha |
| 10 | చతుశ్రుతి ధైవతము | ధ | D2 | dhi |
| 10 | శుద్ధ నిషాదము | ని | N1 | na |
| 11 | షట్చ్రుతి ధైవతము | ధ | D3 | dhu |
| 11 | కైసికి నిషాదము | ని | N2 | ni |
| 12 | కాకలి నిషాదము | ని | N3 | nu |

No comments:
Post a Comment